Devineni Uma: మీ స్వార్థ ప్రయోజనాల కోసం పోలవరాన్ని తాకట్టుపెడితే చరిత్ర మిమ్మల్ని క్షమించదు: దేవినేని ఉమ

Devineni Uma says history never forgive if mortgage Polavaram project benefits
  • పోలవరం ప్రాజెక్టు నేపథ్యంలో ధ్వజమెత్తిన ఉమ
  • కేంద్రం చెప్పినా వినకుండా రివర్స్ టెండరింగ్ కు వెళ్లారని వ్యాఖ్యలు
  • కేసుల మాఫీ కోసం ఢిల్లీ వెళుతున్నారని ఆరోపణ
ప్రాజెక్టు పూర్తిచేయాలనే ఆలోచన ప్రభుత్వానికి లేదని టీడీపీ నేత, మాజీ మంత్రి దేవినేని ఉమ విమర్శించారు. రాజకీయ ఆరోపణలు చేసినంత మాత్రాన పోలవరం పూర్తి కాదని వ్యాఖ్యానించారు. కేంద్రం చెప్పినా వినకుండా రివర్స్ టెండరింగ్ కు వెళ్లారని ఉమ ఆరోపించారు.

"కేసుల మాఫీ కోసం ఢిల్లీ వెళుతున్నారు. మీ స్వార్థ ప్రయోజనాల కోసం పోలవరాన్ని తాకట్టు పెడితే చరిత్ర మిమ్మల్ని క్షమించదు" అంటూ సీఎం జగన్ పై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇదే తరహాలో పోలవరం నేపథ్యంలో టీడీపీ అధినేత చంద్రబాబు చేసిన వ్యాఖ్యల క్లిప్పింగ్ ను కూడా ఉమ తన ట్వీట్ లో పంచుకున్నారు.
Devineni Uma
Jagan
Polavaram Project
Telugudesam
YSRCP
Andhra Pradesh

More Telugu News