హైదరాబాదులో రూ.1 కోటి స్వాధీనం... బీజేపీ నేత రఘునందన్ బావమరిది డబ్బు అంటున్న పోలీసులు!
- హైదరాబాదులో భారీగా నగదు పట్టివేత
- ఇన్నోవా వాహనంలో కోటి రూపాయలు
- డ్రైవర్ ను అరెస్ట్ చేసిన పోలీసులు
- సెల్ ఫోన్ లో కీలక సమాచారం ఉందన్న సీపీ
ఈ ఘటనలో ఓ ఇన్నోవా వాహనం, రెండు సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్టు వెల్లడించారు. సెల్ ఫోన్ లో కీలక ఆధారాలు ఉన్నాయని, కారు డ్రైవర్ రవికుమార్ ను అరెస్ట్ చేశామని తెలిపారు. బేగంపేటలో విశాఖ ఇండస్ట్రీస్ సంస్థ మేనేజర్ ద్వారా ఈ డబ్బు వచ్చినట్టు తెలుసుకున్నామని సీపీ అంజనీ కుమార్ వెల్లడించారు. దీనిపై కేసు నమోదు చేసుకున్నామని వివరించారు.