మరో ఆఫర్ ప్రకటించిన హైదరాబాద్ మెట్రో రైల్
- స్మార్ట్ కార్డు రీఛార్జ్ పై క్యాష్ బ్యాక్ ఆఫర్ ప్రకటించిన మెట్రో
- రూ. 600 వరకు క్యాష్ బ్యాక్
- స్మార్ట్ కార్డులోనే జమకానున్న క్యాష్ బ్యాక్
ఈ సందర్భంగా హైదరాబాద్ మెట్రో రైల్ ఎండీ ఎన్వీఎస్ రెడ్డి మాట్లాడుతూ, మెట్రో రైల్ లో ప్రయాణించేందుకు ఎక్కువ మంది ప్రయాణికులు ఆసక్తి చూపిస్తున్నారని అన్నారు. సిటీలో ఉన్న మూడు కారిడార్లలో సగటున రోజుకు 1.30 లక్షల మంది ప్రయాణిస్తున్నారని తెలిపారు. ఇటీవల సువర్ణ ప్యాకేజ్ లో భాగంగా 40 శాతం రాయితీ ప్రకటించామని.. ఆ ఆఫర్ తర్వాత ప్రయాణికుల సంఖ్య 30 శాతం పెరిగిందని చెప్పారు.