కేసీఆర్ కు కాంగ్రెస్ పార్టీని అమ్మేశారు: డీకే అరుణ
- దుబ్బాకలో బీజేపీ గెలుపు ఖాయం
- టీఆర్ఎస్ కు ఓటు అడిగే హక్కు లేదు
- కాంగ్రెస్ పార్టీ ప్రజాదరణ కోల్పోయింది
తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ప్రజాదరణ కోల్పోయిందని డీకే అరుణ ఎద్దేవా చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్ కు కాంగ్రెస్ పార్టీని అమ్మేశారని, రాహుల్ గాంధీ కూడా కనిపించడం లేదని అన్నారు. టీఆర్ఎస్ ను ఓడించే దమ్ము కేవలం బీజేపీకి మాత్రమే ఉందని చెప్పారు. దుబ్బాకకు ఇంత వరకు ఏమీ చేయని టీఆర్ఎస్ కు ఓటు అడిగే హక్కు కూడా లేదని అన్నారు. బీజేపీని అడ్డుకోవడం కోసమే టీఆర్ఎస్ లో ఉన్న శ్రీనివాస్ రెడ్డికి కాంగ్రెస్ టికెట్ ఇచ్చారని విమర్శించారు.