తుంగభద్ర పుష్కరాలు‌.. కఠిన ఆంక్షలు విధించిన ఏపీ ప్రభుత్వం!

AP govt puts restrictions amid Tungabhadra Pushkaras
నవంబర్ 20 నుంచి తుంగభద్ర పుష్కరాలు ప్రారంభం కాబోతున్నాయి. ఈ నేపథ్యంలో పుష్కరాల కోసం ఏపీ ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. మరోవైపు రాష్ట్రంలో కరోనా తీవ్రత ఉన్న నేపథ్యంలో ప్రజలకు రాష్ట్ర ప్రభుత్వం పలు సూచనలు చేస్తోంది. కరోనా నేపథ్యంలో షరతులను విధించింది. రాష్ట్ర ప్రభుత్వం చేసిన సూచనలు ఇవే.

  • 12 ఏళ్ల లోపు పిల్లలకు, 60 ఏళ్ల పైబడిన వృద్ధులకు అనుమతి లేదు.
  • పుష్కరాలకు వచ్చే వారు గుర్తింపు కార్డుతో పాటు, ఈపాస్ తీసుకురావాలి.
  • ఈపాస్ కోసం వెబ్ సైట్లో దరఖాస్తు చేసుకోవాలి. వచ్చిన మెసేజ్ ను పుష్కరఘాట్ వద్ద అధికారులకు చూపించాలి.
  • వెబ్ సైట్ లో పుష్కరఘాట్లు, రవాణా సదుపాయాల ఏర్పాట్ల వివరాలు ఉంటాయి.
  • నిర్ణీత సమయంలోనే పుష్కరఘాట్ కు రావాల్సి ఉంటుంది.
  • ఘాట్ వద్ద కేవలం 15 నిమిషాలు ఉండేందుకు మాత్రమే అనుమతి ఉంటుంది.
  • ఆ తర్వాత ఘాట్ ను శానిటైజ్ చేసి, మరో బ్యాచ్ ను అనుమతిస్తారు.
  • ఘాట్ వద్ద ఒక్కసారి కేవలం 20 మందికి మాత్రమే అనుమతి ఉంటుంది.
  • ఇతర రాష్ట్రాల నుంచి కూడా భక్తులు వచ్చే అవకాశం ఉండటంతో... తెలుగుతో పాటు కన్నడ, హిందీ, ఇంగ్లీష్ భాషల్లో కూడా సమాచార బోర్డులు ఏర్పాటు చేయనున్నారు.
Go Back to Shorts
Tungabhadra Pushkaralu
Andhra Pradesh
Restrictions

More Telugu News