Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

'పెళ్లిసందడి'కి హీరోయిన్ ఫైనల్ అయింది!

Heroin finalized for Pellisandadi
  • రాఘవేంద్రరావు తాజా చిత్రం 'పెళ్లిసందడి'
  • హీరోగా శ్రీకాంత్ తనయుడు రోషన్
  • హీరోయిన్ గా మాళవిక నాయర్ ఎంపిక  
రెండున్నర దశాబ్దాల నాటి సినిమా 'పెళ్లిసందడి' ఎంతటి హిట్టయిందో మనకు తెలుసు. ఇప్పుడు అదే టైటిల్ తో మరో సినిమా నిర్మాణం జరుపుకుంటోంది. ఈ చిత్రానికి నాటి చిత్ర దర్శకుడు కె. రాఘవేంద్రరావు దర్శకత్వ పర్యవేక్షణ వహిస్తుండగా.. గౌరి రోణంకి దర్శకత్వం వహిస్తున్నారు. నాటి సినిమాకు సూపర్ హిట్ సంగీతాన్ని అందించిన కీరవాణి ఇప్పటి 'పెళ్లిసందడి'కి కూడా మ్యూజిక్ చేస్తున్నారు.

 ఇక ఇందులో నాటి 'పెళ్లిసందడి' హీరో శ్రీకాంత్ తనయుడు రోషన్ కథానాయకుడుగా నటిస్తున్నట్టు మొన్ననే అధికారికంగా ప్రకటించారు. అలాగే తాజాగా ఈ చిత్రంలో నటించే కథానాయికను కూడా ఎంపిక చేసినట్టు తెలుస్తోంది. మలయాళ భామ మాళవిక నాయర్ ఇందులో హీరోయిన్ గా నటిస్తుందని సమాచారం. మొదట్లో కొత్త కథానాయికను ఎంపిక చేస్తారని భావించినప్పటికీ, చివరికి మాళవికను ఎంపిక చేశారు.

 ఆర్కా మీడియా వర్క్స్ సంస్థతో కలసి రాఘవేంద్రరావు సోదరుడు కృష్ణమోహన్ రావు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. త్వరలో షూటింగును ప్రారంభించుకునే ఈ 'పెళ్లిసందడి' మరెంతటి సంచలనాన్ని సృష్టిస్తుందో చూడాలి!
Malavika Nair
Roshan
Raghavendra Rao

More Telugu News