అంతర్జాతీయ ప్రయాణికుల కోసం ఈ-బోర్డింగ్.. తొలి విమానాశ్రయంగా శంషాబాద్ ఆర్జీఐఏకు గుర్తింపు
- భారత విమానయాన రంగంలో ఇదో మైలురాయి
- విమానాశ్రయంలో ప్రయాణికుల ఎదురుచూపులకు చెక్
- దేశీయ ప్రయాణికుల కోసం 2015లో అందుబాటులోకి వచ్చిన సేవలు
ఇక, ఈ-బోర్డింగ్ సదుపాయాన్ని పొందిన తొలి ఎయిర్‌లైన్స్‌గా ఇండిగో రికార్డులకెక్కింది. ప్రస్తుతం ఎంపిక చేసిన అంతర్జాతీయ విమాన సర్వీసుల్లో మాత్రమే ఈ సదుపాయం అందుబాటులోకి రాగా, ఈ నెల 2న ఇండిగో విమానంలో హైదరాబాద్ నుంచి షార్జా వెళ్లిన ప్రయాణికులు ఈ-బోర్డింగ్ సేవలను అందుకున్నట్టు తెలిపారు. త్వరలోనే ఇతర అంతర్జాతీయ షెడ్యూల్డ్ విమాన సర్వీసుల్లోనూ ఈ సేవలను ప్రారంభిస్తామన్నారు. కాగా, దేశీయ విమాన ప్రయాణికులకు డిసెంబరు 2015లో ఈ-బోర్డింగ్ సేవలు అందుబాటులోకి వచ్చాయి.