సాయితేజ్ సినిమాలో నెగటివ్ పాత్రలో రమ్యకృష్ణ
- పవర్ ఫుల్ పాత్రలలో నటిస్తున్న రమ్యకృష్ణ
- దేవా కట్ట దర్శకత్వంలో సాయితేజ్ సినిమా
- కీలక పాత్రలో రమ్యకృష్ణ .. టైటిల్ 'రిపబ్లిక్'
మెగా మేనల్లుడు సాయితేజ్ హీరోగా దేవా కట్ట దర్శకత్వంలో ఓ చిత్రం రూపొందుతోంది. రాజకీయ నేపథ్యంతో సాగే ఈ చిత్రాన్ని ఇటీవలే లాంఛనంగా ప్రారంభించారు. ఇందులో రమ్యకృష్ణ ఓ కీలక పాత్ర పోషించనున్నట్టు తాజా సమాచారం. ఈ పాత్ర నెగటివ్ ఛాయలతో సాగుతుందని, హీరో పాత్రకు దీటుగా ఉంటుందనీ అంటున్నారు.
ఇక ఇందులో సాయితేజ్ సరసన నివేద పేతురాజ్ హీరోయిన్ గా నటిస్తోంది. దీనికి 'రిపబ్లిక్' అనే టైటిల్ని పరిశీలిస్తున్నట్టు తెలుస్తోంది. ఈ సినిమాకి బ్యాక్ గ్రౌండ్ స్కోర్ చాలా కీలకమని, అందుకే సంగీత దర్శకుడిగా మణిశర్మని తీసుకున్నారని అంటున్నారు.