ఢిల్లీ బౌలింగ్ ను ఊచకోత కోసిన సాహా, వార్నర్... సన్ రైజర్స్ భారీ స్కోరు
- దుబాయ్ లో సన్ రైజర్స్ వర్సెస్ ఢిల్లీ
- మొదట బ్యాటింగ్ చేసిన సన్ రైజర్స్
- సాహా, వార్నర్ అర్ధసెంచరీలు
- ఫోర్లు, సిక్సుల వాన
సాహా 45 బంతుల్లో 12 ఫోర్లు, 2 సిక్సులతో 87 పరుగులు చేయగా, వార్నర్ 34 బంతుల్లో 8 ఫోర్లు, 2 సిక్సులతో 66 పరుగులు సాధించాడు. ఈ కుడిఎడమల జోడీని విడదీసేందుకు ఢిల్లీ బౌలర్లు తీవ్రంగా శ్రమించాల్సి వచ్చింది. తొలి వికెట్ కు 107 పరుగులు జోడించిన అనంతరం వార్నర్... అశ్విన్ బౌలింగ్ లో అవుటయ్యాడు. నోర్జే బౌలింగ్ లో సాహా కూడా వెనుదిరగడంతో స్కోరు కాస్త నిదానించింది. చివర్లో మనీశ్ పాండే 31 బంతుల్లో 44 పరుగులు చేయడంతో జట్టు స్కోరు 200 దాటింది.