టీడీపీ నేతల గృహ నిర్బంధాన్ని నిరసిస్తూ.. చిత్తూరు ఎస్పీకి చంద్రబాబు లేఖ
- రామకుప్పం మండలంలో టీడీపీ మహాపాదయాత్రను అడ్డుకున్న పోలీసులు
- నేతలను ఎక్కడికక్కడ గృహ నిర్బంధం చేసిన పోలీసులు
- రాజ్యాంగ స్ఫూర్తిని కాలరాశారని మండిపాటు
ప్రభుత్వానికి ప్రజల ప్రాథమిక అవసరాలను తీర్చడం కంటే మరేదో ముఖ్యమైన అంశం ఉన్నట్టు కనిపిస్తోందని విమర్శించారు. టీడీపీ నేతలను గృహ నిర్బంధం చేసిన చిత్తూరు జిల్లా పోలీసులు రాజ్యాంగ స్ఫూర్తిని కాలరాశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అక్రమంగా నిర్బంధించిన వారిని తక్షణం విడుదల చేయాలని ఎస్పీకి రాసిన లేఖలో చంద్రబాబు డిమాండ్ చేశారు.