సరిహద్దులో ఉద్రిక్తతలు ముగిసిపోవాలని ప్రార్థించా: శస్త్ర పూజ తర్వాత రాజ్ నాథ్ సింగ్
- డార్జిలింగ్ లోని సుక్నా వార్ మెమోరియల్ వద్ద ఆయుధ పూజ
- ఆయుధాలు, ఆయుధాలు ధరించిన వాహనాలకు పూజ
- సైనికుల ధైర్యసాహసాలను చరిత్ర గుర్తుంచుకుంటుందని వ్యాఖ్య
ఈ సందర్భంగా రాజ్ నాథ్ సింగ్ మాట్లాడుతూ, దేశాన్ని రక్షించడం కోసం మన సైనికులు ప్రాణత్యాగాలు చేశారని చెప్పారు. ఇండో-చైనా సరిహద్దులో ఉద్రిక్తతలు తగ్గిపోవాలని, శాంతి నెలకొనాలని తాము కోరుకుంటున్నామని తెలిపారు. కానీ, అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకుంటూనే ఉన్నాయని అన్నారు. మన భూభాగాన్ని ఒక్క ఇంచు కూడా ఎవరూ తీసుకోకుండా మన సైనికులు కాపాడుకోగలరని విశ్వాసం వ్యక్తం చేశారు. మన సైనికుల ధైర్యసాహసాలను చరిత్ర గుర్తుంచుకుంటుందని చెప్పారు.
మరో వైపు పూజ సందర్భంగా పలు ఆయుధాలను, ఆయుధాలు కలిగిన వాహనాలకు రాజ్ నాథ్ పూజ నిర్వహించారు. సంస్కృతంలో ప్రార్థనలను నిర్వహించారు.