భళా ముంబయి... చిత్తుగా ఓడిన చెన్నై!
- షార్జాలో ముంబయి ఘనవిజయం
- 10 వికెట్ల తేడాతో నెగ్గిన ముంబయి
- రాణించిన ఇషాన్ కిషన్, డికాక్
ఇషాన్ కిషన్ చిచ్చరపిడుగల్లే చెలరేగి 37 బంతుల్లో 68 పరుగులు సాధించగా, డికాక్ 37 బంతుల్లో 46 పరుగులు నమోదు చేశాడు. ముఖ్యంగా ఇషాన్ కిషన్ 6 ఫోర్లు, 5 సిక్సులతో విధ్వంసం సృష్టించాడు. డికాక్ 5 ఫోర్లు, 2 సిక్సులు బాదాడు. చెన్నై బౌలర్లు ఎంత శ్రమించినా కనీసం ఒక్క వికెట్ కూడా తీయలేకపోయారు.