Anitha: చిల్లర మాటలు మాట్లాడొద్దు... గతంలో చీరల కొట్లో పనిచేశారా?: విష్ణువర్ధన్ రెడ్డిపై అనిత ఫైర్

TDP leader Vangalapudi Anitha fires on BJP leader Vishnuvardhan Reddy
  • అమరావతి రైతులను చిన్నచూపు చూడొద్దన్న అనిత
  • రైతు ఇలాగే ఉండాలని ఏమైనా రూల్ ఉందా? అంటూ ఆగ్రహం
  • జగన్ ప్రాపకం కోసం వేరే మార్గం చూసుకోవాలని హితవు
ఏపీ బీజేపీ ప్రధాన కార్యదర్శి విష్ణువర్ధన్ రెడ్డిపై టీడీపీ నేత వంగలపూడి అనిత ధ్వజమెత్తారు. అమరావతిలో మహిళలు 50 వేల రూపాయల చీరలు కట్టుకుని దీక్షలో పాల్గొంటున్నారని విష్ణువర్ధన్ రెడ్డి వ్యాఖ్యలు చేశారంటూ ఆమె మండిపడ్డారు.

"విష్ణురెడ్డి గారూ... మీరు అంత కచ్చితంగా చీరల రేట్లు చెబుతున్నారు... గతంలో మీరేమైనా చీరల కొట్లో పనిచేశారా? రైతు అంటే ఇలాగే ఉండాలని ఏమైనా రూల్ ఉందా? రైతులంటే అంత చిన్నచూపు దేనికి? జగన్ రెడ్డి గారి ప్రాపకం కావాలంటే మరో మార్గం వెతుక్కోండి, అంతే తప్ప ఇలా చీరలు, చొక్కాలు అంటూ చిల్లర మాటలు దేనికండీ" అంటూ అనిత హెచ్చరించారు.
Anitha
Vishnu Vardhan Reddy
Amaravati
Woman
Farmers
Jagan
BJP
YSRCP
Telugudesam
Andhra Pradesh

More Telugu News