ఇలాంటి దారుణాలకు పాల్పడే వారికి సమాజంలో బతకడానికి చోటులేదు: దీక్షిత్ హత్యపై మంత్రి సత్యవతి
- దీక్షిత్‌రెడ్డి కుటుంబాన్ని పరామర్శించిన మంత్రి
- నిందితుడిని కఠినంగా శిక్షించాలని వ్యాఖ్య
- తమ సర్కారు అండగా ఉంటుందని హామీ
దీక్షిత్‌రెడ్డి కుటుంబాన్ని సత్యవతి రాథోడ్ ఈ రోజు పరామర్శించారు. శనిగపురం వెళ్లిన ఆమె బాలుడి తల్లిదండ్రులు రంజిత్‌రెడ్డి, వసంతతో మాట్లాడి ధైర్యంగా ఉండాలని చెప్పారు. వారికి తమ సర్కారు అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. నిందితులు సాంకేతికతను వినియోగించుకుని ఇటువంటి ఘటనలకు పాల్పడడానికి ప్రయత్నం చేయడం విచారకరమని తెలిపారు.