సక్సెస్ దిశగా ఆక్స్‌ఫర్డ్ టీకా.. వివరాలు వెల్లడించిన పరిశోధకులు

better results of oxford vaccine
  • టీకా అభివృద్ధిలో ఆస్ట్రాజెనికా- ఆక్స్‌ఫర్డ్‌ ముందంజ
  • కొనసాగుతోన్న మూడో దశ క్లినికల్ ట్రయల్స్ 
  • ఆశాజనకంగా ఫలితాలు
  • రోగ నిరోధకతను ఎలా ఉత్తేజపరుస్తుందోన్న విషయం గుర్తింపు
ప్రపంచాన్ని వణికిస్తోన్న కరోనా వైరస్‌ను అరికట్టేందుకు వ్యాక్సిన్‌ను అభివృద్ధి చేయడానికి ప్రపంచ వ్యాప్తంగా పరిశోధకులు ప్రయత్నాలు కొనసాగిస్తోన్న విషయం తెలిసిందే. ఈ విషయంలో ఆస్ట్రాజెనికా- ఆక్స్‌ఫర్డ్‌ యూనివర్సిటీ సంయుక్తంగా అభివృద్ధి చేసిన వ్యాక్సిన్‌ ముందంజలో ఉంది. ఇప్పటికే దీని మూడో దశ క్లినికల్ ట్రయల్స్ కొనసాగుతున్నాయి.

ఇందుకు సంబంధించిన ఫలితాలపై పరిశోధకులు శుభవార్త తెలిపారు. దీని ఫలితాలు ఆశాజనకంగా ఉన్నట్టు చెప్పారు. కొత్త పద్ధతులను వినియోగించి వ్యాక్సిన్ ఏ విధంగా రోగ నిరోధకతను ఉత్తేజపరుస్తుందోన్న విషయాన్ని పరిశోధకులు గుర్తించారు. ఇందుకు సంబంధించిన వివరాలను ‘రిసెర్చ్‌ స్క్వేర్‌ జర్నల్’‌లో ప్రచురించారు.

మానవ శరీరంలో జన్యు సూచనలను ఇది పాటిస్తుందా? అనే విషయాన్ని గుర్తించడంలో ఈ పరిశోధన చాలా కీలకమని  బ్రిస్టల్స్‌ స్కూల్‌ ఆఫ్‌ సెల్యూలార్‌ అండ్‌ మాలిక్యూలర్‌ మెడిసిన్‌(సీఎంఎం) వైరాలజీ పరిశోధకులు తెలిపారు. పరిశోధకులు ఊహించినట్లుగానే ఈ వ్యాక్సిన్ శరీరంలో పని చేస్తోందని తేలింది.

టీకా మానవ కణాల లోపలికి చేరినప్పుడు సరిగ్గా ఏమి చేస్తుందో పరిశీలించడానికి కొత్త సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగిస్తున్నట్లు పరిశోధకులు తెలిపారు.పెద్ద మొత్తంలో కరోనా వైరస్ స్పైక్ ప్రొటీన్ ఉత్పత్తి అవుతున్నట్టు అధ్యయనంలో భాగంగా నిర్ధారణకు వచ్చినట్లు వివరించారు. రోగనిరోధక ప్రతిస్పందనను ప్రేరేపించడంలో టీకా విజయాన్ని వివరించడానికి తాము చేసిన పరిశోధన  తోడ్పడుతుందని చెప్పారు.
Go Back to Shorts
oxford
vaccine
Corona Virus
COVID19

More Telugu News