Chandrababu: ఎందరో పోలీసులు ప్రజల హృదయాల్లో చిరంజీవులై నిలిచారు: చంద్రబాబు
- పోలీసు అమరవీరులకు నివాళి అర్పించిన చంద్రబాబు
- పోలీసుల త్యాగాలు చిరస్మరణీయమని వ్యాఖ్య
- ప్రాణాలను సైతం అర్పించారని కితాబు
విధి నిర్వహణలో ప్రాణాలర్పించిన పోలీసు అమరవీరులకు హృదయపూర్వకంగా నివాళులర్పిస్తున్నానని టీడీపీ అధినేత చంద్రబాబు తెలిపారు. పోలీసు అమరవీరుల దినోత్సవం సందర్భంగా ట్విట్టర్ ద్వారా ఆయన స్పందిస్తూ, సమాజంలో శాంతి భద్రతల పరిరక్షణ, నేరాల నియంత్రణ, పౌరుల ప్రాథమిక హక్కులు, రాజ్యాంగ హక్కుల పరిరక్షణలో బాధ్యతాయుతమైన సేవలు అందించే పోలీసుల త్యాగాలు చిరస్మరణీయమని అన్నారు. అరాచక శక్తులను అణచివేసే ప్రయత్నంలో తమ ప్రాణాలను సైతం తృణప్రాయంగా అర్పించిన ఎందరో పోలీసులు ప్రజల హృదయాల్లో చిరంజీవులై నిలిచారని కొనియాడారు.