Jagan: 6,500 పోలీసు ఉద్యోగాలను భర్తీ చేయబోతున్నాం: జగన్

Govt is going to recruit 6500 police announces Jagan
  • పోలీసు ఉద్యోగాల భర్తీకి డిసెంబర్ లో నోటిఫికేషన్ జారీ చేస్తాం
  • పోలీసు శాఖకు చెల్లించాల్సిన బకాయిలను చెల్లిస్తాం
  • దిశ బిల్లుకు కేంద్రం ఆమోదం తెలుపుతుందని భావిస్తున్నా
నిరుద్యోగులకు ముఖ్యమంత్రి జగన్ గుడ్ న్యూస్ చెప్పారు. 6,500 పోలీసు ఉద్యోగాలను భర్తీ చేయబోతున్నట్టు ఆయన ప్రకటించారు. పోలీసు ఉద్యోగాల భర్తీకి డిసెంబర్ లో నోటిఫికేషన్ విడుదల చేస్తామని... జనవరిలో పోస్టుల భర్తీకి షెడ్యూల్ జారీ చేస్తామని తెలిపారు. విజయవాడలోని ఇందిరాగాంధీ స్టేడియంలో పోలీస్ అమరవీరుల దినోత్సవ కార్యక్రమం ఈరోజు జరిగింది. ఈ సందర్భంగా ఆయన ప్రసంగిస్తూ ఈ కీలక ప్రకటన చేశారు.

పోలీసు శాఖకు చెల్లించాల్సిన బకాయిలను కూడా త్వరలోనే చెల్లిస్తామని జగన్ చెప్పారు. దిశ బిల్లును కేంద్ర ప్రభుత్వం ఆమోదిస్తుందని భావిస్తున్నట్టు తెలిపారు. రానున్న రోజుల్లో దిశ పోలీస్ స్టేషన్లు, ప్రత్యేక ప్రాసిక్యూటర్లు, ప్రత్యేక కోర్టులు వస్తాయని చెప్పారు.
Jagan
YSRCP
Police Recruitment

More Telugu News