ప్రతి పోలీసు కుటుంబానికి సమాజం జేజేలు.. కులపరమైన దాడులను ఉపేక్షించొద్దు: జగన్
- పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవం
- రక్షణ విషయంలో రాజీ పడొద్దన్న సీఎం
- కరోనా కాటుకు బలైన పోలీసు కుటుంబాలకు ప్రభుత్వం అండ: సుచరిత
రాష్ట్రంలో మొత్తం 18 దిశ పోలీస్ స్టేషన్లను ఏర్పాటు చేసి వాటి బాధ్యతలను మహిళలకే అప్పగించినట్టు తెలిపారు. పోలీసు అమరవీరుల వివరాలతో కూడిన పుస్తకాన్ని ఈ సందర్భంగా సీఎం ఆవిష్కరించారు. ఇదే కార్యక్రమంలో పాల్గొన్న హోంమంత్రి సుచరిత మాట్లాడుతూ.. కరోనా విధులు నిర్వర్తిస్తూ మహమ్మారికి బలైన పోలీసుల కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందన్నారు. డీజీపీ గౌతం సవాంగ్ మాట్లాడుతూ, సవాళ్లను ఎదుర్కొనే విషయంలో పోలీసులు ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటారని అన్నారు.