బీహార్ ఎన్నికల్లో పోటీపడుతున్నవారిలో 31 శాతం మంది క్రిమినల్సే!
- ఎన్నికల్లో 1,064 మంది పోటీ
- 328 మందిపై క్రిమినల్ కేసులు
- ఆర్జేడీ వారే అధికం
క్రిమినల్ కేసులు ఎదుర్కొంటున్న వారిలో అత్యధికశాతం లాలుప్రసాద్ యాదవ్కు చెందిన ఆర్జేడీ అభ్యర్థులే కావడం గమనార్హం. మొత్తం అభ్యర్థుల్లో 29 మందిపై మహిళలపై వేధింపుల కేసులు నమోదు కాగా, ముగ్గురు అత్యాచారం కేసులు ఎదుర్కొంటున్నారు. 21 మందిపై హత్యానేరం కేసులు, 62 మందిపై హత్యాయత్నం కేసులు నమోదయ్యాయి. అభ్యర్థుల ఎంపికలో పార్టీలు అవలంబించిన తీరును బట్టి ఎన్నికల్లో సంస్కరణలకు ఏ పార్టీ కూడా సిద్ధంగా లేదని ఏడీఆర్ నివేదిక వెల్లడించింది.