భారత సంతతి అమెరికా తెలుగు విద్యార్థిని అనిక చేబ్రోలుకు అవార్డు.. ఉపరాష్ట్రపతి అభినందనలు
- 3ఎం యంగ్ సైంటిస్ట్ చాలెంజ్ లో విజేతగా నిలిచిన అనిక
- కరోనా వైరస్ ప్రొటీన్ ను బంధించే అణువుకు రూపకల్పన
- అమెరికాలో 8వ గ్రేడ్ చదువుతున్న అనిక
ఈ అణువు కరోనాను నియంత్రించే ఔషధాల రూపకల్పనలో విశేషంగా తోడ్పడుతుందని పరిశోధకులు భావిస్తున్నారు. కరోనా వైరస్ పై పరిశోధనల్లో అనిక చూపించిన ప్రజ్ఞ అంతర్జాతీయస్థాయిలో గుర్తింపుకు నోచుకుంది. 3ఎం యంగ్ సైంటిస్ట్ చాలెంజ్ అవార్డు కింద ఆమెకు 25,000 డాలర్ల నగదు బహుమతి లభించనుంది. అనిక చేబ్రోలు టెక్సాస్ లోని ఫ్రిస్కో ప్రాంతంలో నివసిస్తోంది. 14 ఏళ్ల అనిక ప్రస్తుతం 8వ గ్రేడ్ చదువుతోంది.