జయలలిత మృతిపై దర్యాప్తు జరిపిస్తాం: స్టాలిన్
- అన్నాడీఎంకే ప్రభుత్వం కమిటీల పేరుతో కాలయాపన చేస్తోంది
- పన్నీర్ సెల్వం నిందితుడని ఆరోగ్యమంత్రి ఆరోపించారు
- ఆయన విచారణకు కూడా హాజరుకాలేదు
జయ మృతి వెనుక దాగి ఉన్న నిజాలను వెలికి తీసేందుకు ధర్మయుద్ధం చేస్తానని ప్రగల్బాలు పలికిన పన్నీర్ సెల్వం ఎందుకు మౌనంగా ఉంటున్నారని స్టాలిన్ ప్రశ్నించారు. జయ మృతి కేసులో ప్రధాన నిందితుడు పన్నీర్ సెల్వం అని ఆరోగ్యమంత్రి విజయభాస్కర్ ఆరోపించారన్న విషయాన్ని స్టాలిన్ గుర్తు చేశారు. విచారణకు హాజరు కావాలని 2018 డిసెంబర్ లో పన్నీర్ సెల్వంకు కమిటీ సమన్లు పంపినా ఆయన పట్టించుకోలేదని చెప్పారు. డీఎంకే అధికారంలోకి వచ్చిన వెంటనే సమగ్ర విచారణ జరిపి, జయ మృతి వెనుక ఉన్న కుట్రను బహిర్గతం చేస్తామని అన్నారు.