కొడుకు మాటలకు భావోద్వేగానికి గురైన యాంకర్ అనసూయ!
- అప్పట్లో కరోనా, వరదలు లేవు
- ఆ కాలంలోకి వెళ్లాలని ఉందన్న అనసూయ కుమారుడు
- కొడుకు మాటలతో భావోద్వేగానికి గురయ్యానన్న అనసూయ
ఈ విషయాన్ని తన ట్విట్టర్ ఖాతాలో పేర్కొన్న అనసూయ, "అమ్మా... నేను గతంలోకి వెళ్లాలని అనుకుంటున్నాను. అప్పట్లో కరోనా లేదు, వరదలు లేవు. అప్పుడు ఎంతో ఆనందంగా ఉండేవాడిని" అని తన కుమారుడు చెప్పడంతో ఎంతో బాధపడి, కన్నీరు పెట్టుకున్నానని అనసూయ పేర్కొంది. ఈ పరిస్థితులను మనమే కొని తెచ్చుకున్నామని, భావి తరాలకు మనం ఏం ఇవ్వగలమని ఆమె ప్రశ్నించారు. అనసూయ ట్వీట్ ఇప్పుడు వైరల్ అవుతోంది.