Rashmika Mandanna: సినిమా కబుర్లు.. సంక్షిప్త సమాచారం 

Rashmika followers on Insta cross Ten million
  • ఫాలోవర్స్ కి థ్యాంక్స్ చెప్పిన రష్మిక 
  • యూఎస్ బ్యాక్ డ్రాప్ లో ఎన్టీఆర్ సినిమా
  • 'ఖైదీ' రీమేక్ లో భర్తతో పాటు కాజోల్    
*  టాలీవుడ్ క్రేజీ స్టార్ రష్మిక సోషల్ మీడియాలో చాలా చురుగ్గా ఉంటుంది. ఎప్పుడూ ఏదో ఒక విషయాన్ని పంచుకుంటూ అభిమానులతో ముచ్చటిస్తూ ఉంటుంది. ఇప్పుడు ఆమె ఇన్ స్టా ఫాలోవర్స్ సంఖ్య పది మిలియన్లు దాటింది. ఈ సందర్భంగా ఈ చిన్నది సంతోషాన్ని వ్యక్తం చేస్తూ అభిమానులకు థ్యాంక్స్ చెప్పింది.
*  ప్రస్తుతం 'ఆర్ఆర్ఆర్' చిత్రాన్ని చేస్తున్న ఎన్టీఆర్ తన తదుపరి చిత్రాన్ని త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో చేయనున్నాడు. దీనికి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు ప్రస్తుతం జోరుగా సాగుతున్నాయి. కాగా, ఈ చిత్రం అమెరికా బ్యాక్ డ్రాప్ లో రూపొందుతుందని తెలుస్తోంది.
*  కార్తీ హీరోగా తమిళంలో వచ్చిన 'ఖైదీ' చిత్రాన్ని ఇప్పుడు అజయ్ దేవగణ్ హీరోగా హిందీలో రీమేక్ చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. విశేషం ఏమిటంటే, ఇందులో అజయ్ భార్య, ప్రముఖ నటి కాజోల్ కూడా నటిస్తుందని సమాచారం.
Rashmika Mandanna
Junior NTR
Trivikram Srinivas
Kajol

More Telugu News