KTR: తమ ప్రాంత సమస్యను పరిష్కరించమంటూ కేటీఆర్‌కు చిన్ననాటి గురువు ట్వీట్.. తక్షణం స్పందించిన మంత్రి

Minister ktr responds to his high school teacher grievance
  • భారీ వర్షాల కారణంగా అడిక్‌మెట్‌లో పొంగిపొర్లుతున్న డ్రైనేజీలు
  • సమస్యను కేటీఆర్ దృష్టికి తీసుకెళ్లిన హైస్కూలు గురువు
  • పరిష్కరించాలంటూ ఎమ్మెల్యేను పంపిన మంత్రి
హైస్కూల్‌లో తనకు విద్యాబుద్ధులు నేర్పిన గురువు సాయం కోసం మంత్రి కేటీఆర్‌కు ట్వీట్ చేయగా, ఆయన తక్షణం స్పందించి సమస్య పరిష్కారం కోసం ఎమ్మెల్యేను ఆదేశించారు. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు నగరంలోని అడిక్‌మెట్ డివిజన్, లలితానగర్‌లో డ్రైనేజీ పొంగిపొర్లుతోంది. వరద నీరు పోటెత్తడంతో కాలనీ నీట మునిగింది.

దీంతో తమ సమస్యను వివరిస్తూ మంత్రి హైస్కూలు గురువు, లలితానగర్‌ అడిక్‌మెట్‌ రెసిడెన్షియల్‌ వెల్ఫేర్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు సత్యనారాయణ ట్వీట్ చేశారు. సమస్యను పరిష్కరించాల్సిందిగా అభ్యర్థించారు. వెంటనే స్పందించిన కేటీఆర్ సమస్యను పరిష్కరించాల్సిందిగా ముషీరాబాద్‌ ఎమ్మెల్యే గోపాల్‌కు సూచించారు. ఆయన అధికారులతో కలిసి లలితానగర్‌కు వెళ్లి, సమస్యను పరిశీలించారు. అనంతరం పరిష్కరించాల్సిందిగా అధికారులను ఆదేశించి అందుకు తగిన ప్రణాళికలు రూపొందించారు.
KTR
Telangana
Heavy rains
adikmet

More Telugu News