Balakrishna: హైదరాబాద్ వరద బాధితులకు భారీ విరాళం ప్రకటించిన బాలకృష్ణ... పాతబస్తీ వాసుల కోసం బిర్యానీ

Balakrishna donates huge amount to Hyderabad flood affected people
  • హైదరాబాదులో వరదలు
  • చలించిపోయిన బాలయ్య
  • రూ.1.50 కోట్లు విరాళం
హైదరాబాదులో కనీవినీ ఎరుగని రీతిలో వరద బీభత్సం కొనసాగుతున్న నేపథ్యంలో నటుడు, ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ భారీ విరాళం ప్రకటించారు. భారీ సంఖ్యలో ప్రజలు వరదల కారణంగా ప్రాణాలు కోల్పోగా, వేల మంది నిరాశ్రయులయ్యారు. ఈ నేపథ్యంలో బాలకృష్ణ హైదరాబాద్ వరద బాధితుల కోసం రూ.1.50 కోట్ల విరాళం ప్రకటించారు. అంతేకాదు, బసవతారకరామ సేవా సమితి నేతృత్వంలో పాతబస్తీ వాసులకు ఆహారం అందించారు. సుమారు 1000 కుటుంబాలకు బిర్యానీ పంపించారు. ఈ సాయంత్రం ఆహార వితరణ జరగనుంది.

కాగా, హైదరాబాదులోని పలు ప్రాంతాల్లో ఇప్పటికీ వరదలు కొనసాగుతున్నాయి. నిన్న కురిసిన కుంభవృష్టితో నగరం మరోమారు జలమయం అయింది. అత్యధిక ప్రాంతాలు నీటమునిగాయి. ఎక్కడ చూసినా దయనీయ పరిస్థితులు కనిపిస్తున్నాయి.
Balakrishna
Donation
Hyderabad
Floods
Biryani
Old City

More Telugu News