కేజీఎఫ్-2లో అధీరా పాత్రకు సిద్ధం.. మూడు ఫొటోలు పోస్ట్ చేసి ఆశ్చర్యపర్చిన సంజయ్ దత్
- కొన్ని రోజుల క్రితం నీరసంగా కనిపించిన సంజయ్
- ఇప్పుడు పాత సంజయ్ దత్‌లా మారిన వైనం
- కేజీఎఫ్-2లో నటించడంపై క్లారిటీ ఇచ్చిన సంజు
ఇటీవల అభిమానుల్ని ఆందోళనకు గురిచేసిన సంజయ్ దత్ లుక్‌లకు భిన్నంగా ఈ ఫొటోలు ఉన్నాయి. ఆయనకు కేన్సర్ ఉందని తేలడంతో వాటిలో ఆయన సినిమాల్లో నటించే విషయంపై సందిగ్ధత నెలకొన్న విషయం తెలిసిందే. కన్నడ సినిమా కేజీఎఫ్-2లో ఆయన కీలకమైన అధీరా పాత్రలో నటించాల్సి ఉంది. అందులో ఆయన నటిస్తారా? లేదా? అన్న విషయంపై కూడా క్లారిటీ వచ్చేసింది. ఈ సినిమాలో అధీరా పాత్ర కోసం సిద్ధం అవుతున్నానని ఆయన ప్రకటించారు.