మృగాళ్లు రెచ్చిపోతుంటే సీఎం జగన్ మౌనం దాల్చడం సరికాదు: నారా లోకేశ్
- విజయవాడలో బీటెక్ విద్యార్థిని హత్య
- దారుణమని పేర్కొన్న లోకేశ్
- ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని విమర్శలు
వారం రోజుల వ్యవధిలోనే అరడజనుకు పైగా ఘటనలు జరగడం ఆందోళనకరమని వ్యాఖ్యానించారు. వరుసగా మృగాళ్లు మహిళలపై అఘాయిత్యాలకు పాల్పడుతున్న ప్రస్తుత పరిస్థితుల్లో సీఎం జగన్ మౌనం దాల్చడం సరికాదని విమర్శించారు. చట్ట రూపం దాల్చని దిశ చట్టం, ఆర్భాటంగా ప్రారంభించిన దిశ పోలీస్ స్టేషన్లు, అధికారం లేని హోంమంత్రి... ఇక మహిళలకు న్యాయం జరిగేదెప్పుడు? అంటూ లోకేశ్ ట్విట్టర్ లో స్పందించారు.