Viral Videos: బానెట్ పై ట్రాఫిక్ కానిస్టేబుల్.. కారును పోనిచ్చేసిన డ్రైవర్.. వీడియో ఇదిగో

An on duty Delhi Traffic Police personnel dragged on the bonnet
  • ఢిల్లీలో దారుణ ఘటన
  • రహదారి సిగ్నల్ వద్ద విధులు నిర్వహిస్తోన్న ట్రాఫిక్‌ పోలీసు
  • నిబంధనలు ఉల్లఘించిన డ్రైవర్
  • కారు ఆపకుండా దూసుకెళ్లిన వైనం
రహదారి సిగ్నల్ వద్ద విధులు నిర్వహిస్తోన్న ట్రాఫిక్‌ పోలీసు ఓ కారును ఆపాడు. దీంతో అతడికి కోపం వచ్చి ఆపకుండా ముందుకు దూసుకుపోవాలనుకున్నాడు. ఆ కానిస్టేబుల్ కారు ముందే నిలబడి బానెట్ ఎక్కాడు. అయినప్పటికీ అతడు కారును ఆపకుండా కొన్ని మీటర్ల వరకు తీసుకెళ్లాడు. ఇంతలో బ్యాలెన్స్ కోల్పోయిన ట్రాఫిక్ పోలీసు కింద పడిపోయాడు. అయితే, ఎటువంటి గాయాలు కాకుండా బయటపడ్డాడు.

ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించిన అతడిని పోలీసు ఆపి, కారుకి సంబంధించిన పత్రాలు  చూపమని అడిగినందుకే అతడు ఇలా ప్రవర్తించినట్లు తెలుస్తోంది. ఇందుకు సంబంధించిన వీడియో అక్కడి ఓ కెమెరాకు చిక్కింది. ఢిల్లీలోని దౌలా కౌన్ ప్రాంతంలో ఈ ఘటన ఈ నెల 12న చోటు చేసుకుంది. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు కారు నడిపిన వ్యక్తిని పట్టుకుని కేసు నమోదు చేసి తదుపరి దర్యాప్తు జరుపుతున్నారు.
Viral Videos
New Delhi
Police

More Telugu News