ఎవరేమన్నా, ఏమనుకున్నా... ధోనీ టీ-20 కింగేనట!
- సర్వే నిర్వహించిన స్పోర్ట్స్ ఫ్లాష్
- కోహ్లీ కన్నా ధోనీకే అధిక ఓట్లు
- ధోనీపై అభిమానుల నమ్మకం
తాజాగా ఆన్ లైన్ స్పోర్ట్స్ చానెల్ 'స్పోర్ట్స్ ఫ్లాష్' ఓ సర్వేను నిర్వహిస్తూ, టీ-20 కింగ్ ఎవరు అని వివిధ సామాజిక మాధ్యమాల్లో ఓటింగ్ ను నిర్వహించింది. ఇందుకోసం తొలుత నలుగురు ఆటగాళ్లను ఎంపిక చేయగా, అందులో యువరాజ్, ధోనీ, రోహిత్ శర్మ, కోహ్లీ నిలిచారు. ఆపై సెమీ ఫైనల్ పోటీలో యువరాజ్ పై ధోనీ, రోహిత్ పై కోహ్లీ గెలువగా, ఫైనల్ లో కోహ్లీపై ధోనీ గెలిచాడు.