Corona Virus: దేశంలో కరోనా కేసుల అప్ డేట్స్!

India Adds 55342 New Coronavirus Cases
  • గత 24 గంటల్లో 55,342 మందికి కరోనా 
  • మొత్తం కరోనా కేసుల సంఖ్య 71,75,881
  • మృతుల సంఖ్య 1,09,856
  • కోలుకున్న వారు 62,27,296 మంది  
భారత్‌లో గత 24 గంటల్లో 55,342 మందికి కరోనా నిర్ధారణ అయిందని కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ పేర్కొంది. దీంతో దేశంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 71,75,881 కి చేరింది.

గ‌త 24 గంట‌ల సమయంలో 706 మంది కరోనా కారణంగా మృతి చెందారు. దీంతో మృతుల సంఖ్య 1,09,856 కి పెరిగింది. దేశంలో కరోనా నుంచి ఇప్పటివరకు 62,27,296 మంది కోలుకున్నారు. 8,38,729 మందికి ప్రస్తుతం ఆసుపత్రులు, హోం క్వారంటైన్‌లలో చికిత్స అందుతోంది.  

కాగా, దేశంలో నిన్నటి వరకు మొత్తం 8,89,45,107 కరోనా పరీక్షలు నిర్వహించినట్లు భారతీయ వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్) తెలిపింది. నిన్న ఒక్కరోజులోనే 10,73,014 శాంపిళ్లను పరీక్షించినట్లు పేర్కొంది.

Corona Virus
COVID19
India

More Telugu News