కరోనా నుంచి కోలుకున్న వెంకయ్యనాయుడు... తాజా పరీక్షలో నెగెటివ్
- కొన్నిరోజుల కిందట కరోనా బారినపడ్డ వెంకయ్య
- హోం క్వారంటైన్ లో ఉన్న వెంకయ్య
- సోమవారం ఆర్టీపీసీఆర్ టెస్టులు చేసిన ఎయిమ్స్ బృందం
వెంకయ్యనాయుడుకు కరోనా అంటూ సెప్టెంబరు 29న ఓ ప్రకటన వెలువడింది. అప్పటినుంచి వెంకయ్యనాయుడు హోం క్వారంటైన్ లోనే ఉన్నారు. తాజాగా ఆయనకు కరోనా నెగెటివ్ వచ్చిందన్న నేపథ్యంలో భారత ఉపరాష్ట్రపతి కార్యాలయం స్పందించింది. త్వరలోనే వెంకయ్యనాయుడు అధికారిక విధులకు హాజరవుతారని, డాక్టర్ల సూచనల మేరకు వ్యవహరిస్తారని ఓ ప్రకటన చేసింది.