Bandaru Satyanarayana Murthy: క్వారంటైన్ రెడ్డికి ఎంత కష్టం వచ్చింది: బండారు

TDP leader Bandaru Satyanarayana calls Jagan as Quarantine Reddy
  • కరోనా పేషెంట్లందరూ నెల తర్వాతైనా బయటకు వస్తున్నారు
  • జగన్ రెడ్డి మాత్రం ఇంటికే పరిమితమయ్యారు
  • ఢిల్లీకి వెళ్లేందుకు మాత్రమే బయటకు వస్తున్నారు

ముఖ్యమంత్రి జగన్, వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డిపై టీడీపీ నేత బండారు సత్యనారాయణమూర్తి సెటైర్లు వేశారు. కరోనా పేషెంట్లంతా కనీసం నెల రోజుల తర్వాతైనా హోంక్వారంటైన్ నుంచి బయటకు వస్తున్నారని... తాడేపల్లి క్వారంటైన్ లో ఉన్న జగన్ రెడ్డి మాత్రం నెలల తరబడి ఇంటికే పరిమితమయ్యారని విమర్శించారు. ఇంటి నుంచి బయటకు రావడం లేదని చెప్పారు. కేసుల భయంతో ఢిల్లీకి వెళ్లేందుకు మాత్రమే ఇంటి నుంచి బయటకు వస్తున్నారని అన్నారు.

వానొచ్చినా, వరదొచ్చినా, చివరకు సొంత పార్టీ ఎంపీ చనిపోయినా జగన్ కాలు బయటకు కదలడం లేదని విమర్శించారు. రేపు సీబీఐ కోర్టుకు రోజూ రమ్మని పిలిస్తే... రెండు కళ్ల నుంచి కృష్ణ, గోదావరి వరదలేనా? అని ప్రశ్నించారు. క్వారంటైన్ రెడ్డికి ఎంత కష్టం వచ్చిందని ఎద్దేవా చేశారు.

  • Loading...

More Telugu News