Gunasekhar: కుమార్తెను నిర్మాతగా పరిచయం చేస్తున్న దర్శకుడు గుణశేఖర్

Director Gunasekhar introduces his daughter as producer
  • శాకుంతలం చిత్రం రూపొందిస్తున్న గుణశేఖర్
  • నిర్మాతగా వ్యవహరించనున్న నీలిమ గుణ
  • లండన్ వెస్ట్ మినిస్టర్ యూనివర్సిటీలో విద్యాభ్యాసం చేసిన నీలిమ
విలక్షణ దర్శకుడు గుణశేఖర్ 'శాకుంతలం' పేరుతో ఓ ఎపిక్ లవ్ స్టోరీ తీస్తున్నారు. ఈ సినిమాతో తన కుమార్తె నీలిమ గుణ నిర్మాతగా పరిచయం అవుతోందని గుణశేఖర్ వెల్లడించారు. ఈ మేరకు ఆయన ఓ ప్రకటన చేశారు.

"గుణ టీమ్ వర్క్స్ బ్యానర్ పై తెరకెక్కుతున్న శాకుంతలం చిత్రానికి నా కుమార్తె నీలిమ గుణ ఓ నిర్మాతగా వ్యవహరించనుంది. లండన్ లోని వెస్ట్ మినిస్టర్ యూనివర్సిటీలో ఆమె ఆర్ట్ అండ్ విజువల్ కల్చర్ పట్టా అందుకుంది. ఆమెకు మీ ప్రేమాభిమానాలు, మద్దతు లభిస్తాయని ఆశిస్తున్నాను... కృతజ్ఞతలు" అంటూ తన ప్రకటనలో పేర్కొన్నారు.

'రుద్రమదేవి' వంటి చారిత్రక చిత్రాన్ని తెరకెక్కించిన దర్శకుడు గుణశేఖర్ ఈసారి ప్రేమకావ్యం తీస్తున్నారు. ఈ సినిమాలో అనుష్క లీడ్ రోల్ పోషిస్తుందని ప్రచారం జరుగుతోంది. అభిమానులు కూడా అదే కోరుకుంటున్నారు.
Gunasekhar
Neelima Guna
Producer
Shaakuntalam
Guna Team Works
Tollywood

More Telugu News