raghavendra rao: ‘పెళ్లి సందడి’ మళ్లీ మొదలవ్వబోతుంది.. రాఘవేంద్రరావు కొత్త సినిమా టైటిల్ వీడియో విడుదల

raghavendra rao new movie
  • మూడేళ్ల తర్వాత మళ్లీ  సినిమా 
  • తారాగణం త్వరలో ప్రకటన
  • ఎంఎం కీరవాణి సంగీత దర్శకత్వం
  • పాటలు రాయనున్న చంద్రబోస్  
దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు మూడేళ్ల తర్వాత ఓ కొత్త సినిమా తీస్తున్నారు. తన కొత్త చిత్రం గురించి ప్రకటన చేస్తానని రాఘవేంద్రరావు నిన్న ట్విట్టర్ లో తెలిపిన విషయం తెలిసిందే. చెప్పినట్లే ఆయన కొత్త సినిమా పేరును ప్రకటించారు. ‘పెళ్లి సందడి మళ్లీ మొదలవ్వబోతుంది... తారాగణం త్వరలో...’ అని తెలిపారు. అంటే తన కొత్త సినిమా పేరు పెళ్లి సందడి అని, ఇందులో నటించే వారి పేర్లను త్వరలోనే వెల్లడిస్తానని ఆయన ప్రకటించారు.

కె.కృష్ణ‌ మోహన్ రావు సమర్పణలో, ఎంఎం కీరవాణి సంగీతంతో ఈ సినిమా రానుందని ఆయన చెప్పారు. ఈ సినిమాకు గేయ రచయిత చంద్రబోస్ పాటలు రాయనున్నారని తెలిపారు. కాగా, శ్రీకాంత్ హీరోగా అప్పట్లో రాఘవేంద్రరావు దర్శకత్వంలో తక్కువ బడ్జెట్ తో వచ్చిన పెళ్లి సందడి సినిమా ఘన విజయం సాధించి, ఎన్నో చిన్న సినిమాలకు మార్గదర్శకంగా నిలిచిన విషయం తెలిసిందే.
raghavendra rao
Tollywood
mm keeravani
chandrabose

More Telugu News