Chandrababu: ఊసరవెల్లులు కూడా సిగ్గుపడేలా చేస్తున్నారు: విజయసాయి రెడ్డి

Vijaya Sai Reddy Setires on Chandrababu
  • రాఫెల్ర విమానాలను తొలుత స్కామన్నారు
  • ఇప్పుడు అదే నోటితో శక్తి పెరిగిందంటున్నారు
  • చంద్రబాబుపై విజయసాయి విమర్శలు
మాజీ సీఎం చంద్రబాబునాయుడు టార్గెట్ గా వైఎస్ఆర్ కాంగ్రెస్ ఎంపీ విజయసాయిరెడ్డి మరోమారు విరుచుకుపడ్డారు. ఈ మేరకు తన ట్విట్టర్ ఖాతాలో ఆయన ఓ ట్వీట్ పెట్టారు.

"తనను తాను పాతాళంలోకి గిరాటేసుకోవడంలో బాబు గారిని మించిన అనుభవజ్ఞుడు ప్రపంచంలోనే లేరు. రఫేల్ విమానాల కొనుగోళ్లలో ప్రధాని 59 వేల కోట్ల స్కాముకు పాల్పడ్డారని దుమ్మెత్తిపోశాడు. అదే నోటితో రఫేల్ ఫైటర్లతో దేశం శక్తి పెరిగిందని కొనియాడటం ఊసరవెల్లులను సిగ్గుపడేలా చేయడం కాక మరేమిటి" అని ప్రశ్నించారు.
Chandrababu
Vijayasai Reddy
Twitter
Rafale

More Telugu News