Revanth Reddy: మా వాళ్లను అరెస్ట్ చేసి రాక్షసానందం పొందుతున్నారు: కేసీఆర్ పై రేవంత్ ఫైర్

Revanth Reddy slams CM KCR over latest situations
  • మినిస్టర్స్ క్వార్టర్స్ వద్ద కాంగ్రెస్ శ్రేణుల ఆందోళన
  • హోంమంత్రి నివాసంలోకి చొరబడేందుకు యత్నం
  • అరెస్ట్ చేసిన పోలీసులు
  • ట్విట్టర్ లో స్పందించిన రేవంత్
కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి తెలంగాణ సీఎం కేసీఆర్ పై ధ్వజమెత్తారు. నేరాలకు, ఘోరాలకు పాల్పడుతున్న వాళ్లను వదిలేస్తున్నారని, బాధితులకు అండగా నిలిచిన కాంగ్రెస్ శ్రేణులను ఇబ్బందులకు గురిచేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. బాధితులకు మద్దతుగా నిలిచిన కాంగ్రెస్ నాయకులను, కార్యకర్తలను అరెస్ట్ చేసి రాక్షసానందం పొందుతున్న కేసీఆర్ ఖబర్దార్ అంటూ రేవంత్ రెడ్డి హెచ్చరించారు. ఈ మేరకు రేవంత్ రెడ్డి ట్వీట్ చేశారు.

రాష్ట్రంలో అరాచక పరిస్థితులు ప్రబలుతున్నాయంటూ కాంగ్రెస్ శ్రేణులు ఇవాళ హైదరాబాదులో మినిస్టర్స్ క్వార్టర్స్ ఎదుట ఆందోళన చేపట్టాయి. కాంగ్రెస్ కార్యకర్తలు ఈ సందర్భంగా క్వార్టర్స్ గోడ దూకి రాష్ట్ర హోంమంత్రి మహమూద్ అలీ నివాసంలోకి చొరబడేందుకు యత్నించడంతో అక్కడ ఉద్రిక్తత ఏర్పడింది. ఈ క్రమంలో పోలీసులు కాంగ్రెస్ కార్యకర్తలను అదుపులోకి తీసుకున్నారు. దీనిపైనే రేవంత్ స్పందించినట్టు తెలుస్తోంది.
Revanth Reddy
KCR
Congress
Arrest
Police
Hyderabad

More Telugu News