ఏపీ కరోనా బులెటిన్: కొత్తగా 42 మరణాలు, 5,292 పాజిటివ్ కేసులు
- గత 24 గంటల్లో చిత్తూరు జిల్లాలో 784 కేసులు
- అత్యల్పంగా కర్నూలు జిల్లాలో 175 మందికి పాజిటివ్
- తాజాగా 6,102 మందికి కరోనా నయం
ఓవరాల్ గణాంకాలు చూస్తే... మొత్తం మరణాల సంఖ్య 6,128కి పెరిగింది. ఇప్పటివరకు 7,39,719 పాజిటివ్ కేసులు నమోదు కాగా, 6,84,930 మందికి కరోనా నయం అయింది. ఇంకా 48,661 మంది చికిత్స పొందుతున్నారు.