కేజీఎఫ్ చాప్టర్ 2 షూటింగ్ స్టార్ట్... ఇడుగో యశ్!
- మళ్లీ ఊపందుకుంటున్న చిత్రీకరణలు
- సముద్రతీరంలో కేజీఎఫ్ సీక్వెల్ షూటింగ్
- రాఖీ ప్రయాణం మొదలైందన్న యశ్
కరోనా వ్యాప్తితో ఇన్నాళ్లు నిలిచిపోయిన కేజీఎఫ్ చాప్టర్ 2 షూటింగ్ లాక్ డౌన్ సడలింపుల నేపథ్యంలో మళ్లీ షురూ అయింది. ఇవాళే హీరో యశ్ కూడా సెట్స్ పైకి వచ్చారు. సముద్ర తీరప్రాంతంలో చిత్రీకరించిన కొన్ని సన్నివేశాల్లో పాల్గొన్నారు. మరోసారి రాకింగ్ లుక్స్ తో యశ్ కనువిందు చేస్తున్న ఫొటో అభిమానులను విశేషంగా ఆకట్టుకుంటోంది.
ఈ ఫొటోను యశ్ తన ఇన్ స్టాగ్రామ్ అకౌంట్ లో పోస్టు చేసి, అలలను మనం ఆపలేకపోవచ్చు కానీ సముద్రయానం ఎలా చేయాలో నేర్చుకోవచ్చు... ఇవాళ్టి నుంచి రాఖీ ప్రస్థానం సాగిస్తున్నాడు అంటూ కామెంట్ చేశారు.