Ghattamaneni: మహేశ్ బాబు కుటుంబ సభ్యులకు చెందిన మరికొన్ని ఫొటోలు ఇవిగో!

Some more pics of Ghattamaneni family members
  • నిన్న హీరో సుధీర్ బాబు భార్య ప్రియదర్శిని పుట్టినరోజు
  • అంతా ఒక్కచోట చేరిన ఘట్టమనేని కుటుంబ సభ్యులు
  • కుటుంబమే సర్వస్వం అని పేర్కొన్న మంజుల
సూపర్ స్టార్ మహేశ్ బాబు, ఆయన తండ్రి కృష్ణ, తల్లి ఇందిరాదేవి, అక్కలు, బావలు.. ఇలా అందరూ ఒక్కచోటికి చేరితే అది అభిమానులకు కన్నులపండుగే అవుతుంది. సూపర్ స్టార్ కృష్ణ చిన్నకుమార్తె, హీరో సుధీర్ బాబు అర్ధాంగి ప్రియదర్శిని నిన్న పుట్టినరోజు జరుపుకున్నారు. ఈ సందర్భంగా ఘట్టమనేని కుటుంబసభ్యులందరూ ఒక్కచోటికి చేరారు. ఈ ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో విపరీతంగా వైరల్ అవుతున్నాయి.

తాజాగా కృష్ణ మరో కుమార్తె మంజుల మరికొన్ని ఫొటోలు పంచుకున్నారు. పాతరోజులను జ్ఞప్తికి తెస్తూ మా చిన్ని చెల్లెలు అందరినీ ఒక్కచోటికి చేర్చడం చూస్తుంటే ఎంతో అద్భుతంగా ఉంది. ఈ శుభ సందర్భంలో అందరం నవ్వుకున్నాం, మాట్లాడుకున్నాం. కొన్నిసందర్భాల్లో కుటుంబమే సర్వస్వం అవుతుంది అంటూ మంజుల ట్వీట్ చేశారు.
Ghattamaneni
Krishna
Mahesh Babu
Priyadarshini
Manjula
Sudheer Babu
Tollywood

More Telugu News