Chinna Jeeyar Swamy: ఆశ్రమంలోకి వచ్చిన తాబేలు పిల్లకు ఆహారం తినిపించిన చినజీయర్ స్వామి

Chinna Jeeyar Swamy feeds a tortoise in his Ashram
  • ఇటీవల శ్రీకూర్మం క్షేత్రాన్ని సందర్శించిన స్వామి
  • కొన్నిరోజులకే ఆశ్రమంలో తాబేలు పిల్ల ప్రత్యక్షం
  • తాబేలు పిల్లను ఎంతో జాగ్రత్తగా చూసుకుంటున్న స్వామి
ప్రముఖ ఆధ్యాత్మిక వేత్త, హైందవ ప్రచారకర్త చినజీయర్ స్వామి ఇటీవలే శ్రీకాకుళం జిల్లా శ్రీకూర్మం క్షేత్రాన్ని దర్శించుకుని రంగారెడ్డి జిల్లా ముచ్చింతల్ లోని తమ ఆశ్రమానికి వచ్చారు. అయితే ఆయన ఆశ్రమానికి తిరిగొచ్చిన కొన్నిరోజులకే ఓ తాబేలు పిల్ల ఆశ్రమంలోకి వచ్చింది.

ఈ విషయం తెలిసిన చినజీయర్ స్వామి విస్మయానికి గురయ్యారు. అంతేకాదు, ఆ తాబేలును ఎంతో జాగ్రత్తగా సంరక్షిస్తూ, స్వయంగా ఆయనే దానికి ఆహారం తినిపిస్తున్నారు. దీనికి సంబంధించిన ఫొటోలను ఆశ్రమ వర్గాలు విడుదల చేశాయి.
Chinna Jeeyar Swamy
Tortoise
Feed
Ashram
Sree Kurmam

More Telugu News