KTR: అన్ని చోట్ల కరోనా కేసులు పెరుగుతుంటే మన దగ్గర మాత్రం అదుపులో ఉన్నాయి: కేటీఆర్

Conrona is under control in Telangana says KTR
  • గత ఆరు నెలలుగా ఆరోగ్యశాఖ అద్భుతంగా పని చేసింది
  • కరోనాను నియంత్రించడంలో తెలంగాణ విజయవంతమైంది
  • వ్యాధుల పట్ల ప్రజల్లో కూడా అవగాహన పెరిగింది
కరోనా వ్యాప్తిని నియంత్రించడంలో తెలంగాణ ప్రభుత్వం విజయవంతమైందని మంత్రి కేటీఆర్ చెప్పారు. గత ఆరు నెలలుగా వైద్య, ఆరోగ్య శాఖ అద్భుతంగా పని చేసిందని... వైద్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ నేతృత్వంలో మంచి పనితీరును కనపరిచిందని కితాబిచ్చారు. హెల్త్ సెక్రటరీ నుంచి ఆశా వర్కర్ వరకు ప్రతి ఒక్కరూ తమ వంతు బాధ్యతను నిర్వర్తించారని కొనియాడారు. ప్రజల్లో భరోసాను కల్పించారని అన్నారు. ఇతర రాష్ట్రాలలో కరోనా కేసులు పెరుగుతుంటే... మన రాష్ట్రంలో మాత్రం అదుపులో ఉందని చెప్పారు.

ఈ ఆరు నెలల్లోనే కాకుండా గత ఆరేళ్లుగా వైద్య, ఆరోగ్యశాఖ గొప్ప పనితీరును కనపరిచిందని కేటీఆర్ చెప్పారు. మాతాశిశు మరణాల రేటును తగ్గించిందని, ఐసీయూ యూనిట్లు, బ్లడ్ బ్యాంకులు, డయాలసిస్ కేంద్రాల ఏర్పాటు వంటి అనేక కార్యక్రమాలను నిర్వహించిందని తెలిపారు. సీజనల్ వ్యాధులు, రోగాల పట్ల ప్రజల్లో కూడా అవగాహన పెరిగిందని అన్నారు. రానున్న రోజుల్లో మెడికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని మరింత బలోపేతం చేసే దిశగా ప్రభుత్వం పని చేస్తుందని చెప్పారు.
KTR
TRS
Telangana
Corona Virus
Etela Rajender

More Telugu News