manchu laxmi: మంచు లక్ష్మి చిన్నప్పుడు ఇలా ఉండేది.. బర్త్‌ డే వేళ ఫొటో షేర్ చేసిన మోహన్ బాబు

mohan babu shares manchu laxmi childhood pic
షార్ట్స్‌లో చూడండి
సినీన‌టి మంచు ల‌క్ష్మి ఈ రోజు పుట్టిన రోజు వేడుక జ‌రుపుకుంటోంది. ఆమెకు ప‌లువురు సినీ ప్ర‌ముఖులు శుభాకాంక్ష‌లు తెలుపుతున్నారు. ఆమె తండ్రి, సినీన‌టుడు మంచు మోహ‌న్ బాబు ఈ సంద‌ర్భంగా ఆమెను చిన్న‌ప్పుడు ఎత్తుకున్న ఫొటోను పోస్ట్ చేస్తూ త‌న కూతురికి హ్యాపీ బ‌ర్త్ డే చెప్పారు. సినిమా షూటింగ్ స‌మ‌యంలో మోహ‌న్ బాబు ఈ ఫొటో దిగిన‌ట్లు తెలుస్తోంది.

నా అమూల్య‌మైన సంప‌ద వంటి నీకు పుట్టిన‌రోజు శుభాకాంక్ష‌లు లక్ష్మి మంచు. ఎన్ని జ‌న్మ‌లైనా నువ్వు నా కూతురిగా పుట్టాలని ఆ దేవుడిని ప్రార్థిస్తున్నాను. ల‌వ్ యూ.. హ్యాపీ బ‌ర్త్ డే ల‌క్ష్మి మంచు అని మోహ‌న్ బాబు ట్వీట్ చేశారు. నా ముద్దుల కుమార్తె మంచు ల‌క్ష్మీ ప్ర‌స‌న్న వ‌జ్ర వైఢూర్య పుష్య గోమేదిక మ‌ర‌క‌త మాణిక్యం లాంటిదంటూ ఆయ‌న పేర్కొన్నారు. దీనిపై స్పందించిన మంచు లక్ష్మి.. 'అ! నాన్న' అంటూ ఆ ట్వీట్ ను రీట్వీట్ చేసింది.
Go Back to Shorts
manchu laxmi
Mohan Babu
Tollywood

More Telugu News