TDP: టీడీపీ సీనియర్ నేత పార్థసారథి కన్నుమూత

Telangana TDP leader Parthasarathi passes away
  • టీడీపీలో క్రియాశీలంగా పనిచేసిన పార్థసారథి
  • నివాళులర్పించిన పలువురు ప్రముఖులు, జర్నలిస్టులు
  • నిన్న నాగోల్ శ్మశాన వాటికలో అంత్యక్రియలు
ప్రముఖ పాత్రికేయుడు, టీడీపీ సీనియర్ నేత ముండుంబై పార్థసారథి బోడుప్పల్‌లోని ఆయన నివాసంలో మంగళవారం కన్నుమూశారు. ఆయన వయసు 77 సంవత్సరాలు. వివిధ దినపత్రికల్లో పనిచేసిన ఆయన 1983లో టీడీపీలో చేరి క్రియాశీలంగా పనిచేశారు. ఆయనకు భార్య, కుమారుడు ఉన్నారు.

ఆయన మృతి వార్త తెలుసుకున్న ముషీరాబాద్ ఎమ్మెల్యే ముఠా గోపాల్, టీడీపీ సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ అధ్యక్షుడు పిన్నమనేని సాయిబాబా, టీఎన్జీవో నాయకుడు రమణయ్య, టీడీపీ నాయకుడు పాలకూర్తి మధుసూదన్‌రావు, పి.బాల్‌రాజ్‌గౌడ్‌, పలువురు జర్నలిస్టులు పార్థసారథి భౌతిక కాయాన్ని సందర్శించి నివాళులర్పించారు. నిన్న నాగోల్ శ్మశాన వాటికలో ఆయన అంత్యక్రియలు నిర్వహించారు.
TDP
Telangana
Parthasarthi
Died

More Telugu News