హత్రాస్ బాధితురాలు నిందితుడిని మొక్కజొన్న చేనుకు పిలిచింది: బీజేపీ నేత వివాదాస్పద వ్యాఖ్యల వీడియో వైరల్!
- ఆమె ఓ ఆవారా యువతి
- ఇలాంటి ఆవారాలు అడవుల్లో, చేలల్లో మరణిస్తూ కనిపించడం సాధారణమే
- నిందితులు మంచోళ్లు, నిర్దోషులు
మొక్కజొన్న చేలు, జొన్న పొలాలు, అడవుల్లో ఇలాంటి ఆవారా యువతులు మరణిస్తూ కనిపించడం సర్వసాధారణమైన విషయమేనని పేర్కొన్నారు. కనీసం సీబీఐ చార్జిషీటు దాఖలు చేసేంత వరకైనా నిందితులను విడిచిపెట్టాలని కోరారు. నిందితులు నిర్దోషులని తేల్చి చెప్పారు. రంజిత్ శ్రీవాస్తవ వ్యాఖ్యలపై మహిళా కమిషన్ మండిపడింది. ఆయనకు నోటీసులు పంపిస్తామని కమిషన్ చైర్‌పర్సన్ రేఖాశర్మ చెప్పారు. కాగా, బీజేపీ నేత రంజిత్‌పై ఇప్పటి వరకు 44 క్రిమినల్ కేసులు నమోదై ఉండడం గమనార్హం.