కేంద్ర మంత్రికి లేఖ రూపంలో 'నీటి' వివరాలు సమర్పించిన సీఎం జగన్

jagan writes letter to nda govt
  • రాయలసీమకు శ్రీశైలం నీరే ఆధారం
  • తాగు, సాగునీరు, పారిశ్రామిక అవసరాలకు శ్రీశైలంపైనే ఆధారపడ్డాం
  • థార్‌ తర్వాత అత్యంత తక్కువ వర్షపాతం అనంతపురం జిల్లాలో
అపెక్స్ కౌన్సిల్ సమావేశంలో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, ఏపీ సీఎం జగన్‌తో కేంద్ర మంత్రి షెకావత్ మాట్లాడిన విషయం తెలిసిందే. అనంతరం షెకావత్‌కు జగన్ ఓ లేఖ అందించారు. అందులోని వివరాలు మీడియాకు చేరాయి.

దుర్భిక్షమైన రాయలసీమ జిల్లాలతో పాటు నెల్లూరు, ప్రకాశంకు శ్రీశైలం నీరే ఆధారమని జగన్ ఆ లేఖలో పేర్కొన్నారు. తెలుగు గంగ, ఎస్‌ఆర్‌బీసీ, కేసీ కెనాల్, గాలేరు-నగరి శ్రీశైలంపైనే ఆ జిల్లాలు ఆధారపడ్డాయని తెలిపారు. అంతేగాక, సోమశిల, కండలేరు, వెలిగొండ, హంద్రీనీవా, చిత్రావతికి కూడా శ్రీశైలమే ఆధారమని వివరించారు.

తాగు, సాగునీరు, పారిశ్రామిక అవసరాలకు శ్రీశైలంపైనే ఆధారపడ్డామని చెప్పారు. ఎన్నో ఏళ్లుగా ఈ ప్రాజెక్టులు అన్నీ శ్రీశైలంపేనే ఆధారపడి ఉన్నాయని గుర్తు చేశారు. థార్‌ ఎడారి తర్వాత అత్యంత తక్కువ వర్షపాతం అనంతపురం జిల్లాలో పడుతుందని చెప్పారు. ఏపీకి కేటాయించాల్సిన నీరు ఇవ్వాల్సిందేనని కోరారు.
Go Back to Shorts
Jagan
YSRCP
NDA

More Telugu News