Corona Virus: ఏపీ కరోనా అప్ డేట్: 5,795 కొత్త కేసులు, 33 మరణాలు

Corona effect slowdown in Andhra Pradesh
షార్ట్స్‌లో చూడండి
ఏపీలో సాధారణ పరిస్థితుల దిశగా పురోగతి కనిపిస్తోంది. రాష్ట్రంలో కరోనా మహమ్మారి వ్యాప్తి క్రమంగా నెమ్మదిస్తోంది. గడచిన 24 గంటల్లో రాష్ట్రంలో 33 మంది కరోనాతో మృతి చెందగా, 5,795 పాజిటివ్ కేసులు వెల్లడయ్యాయి. అత్యధికంగా చిత్తూరు జిల్లాలో 970, అత్యల్పంగా కర్నూలు జిల్లాలో 123 కేసులు గుర్తించారు. అదే సమయంలో రాష్ట్రవ్యాప్తంగా 6,046 మంది కరోనా నుంచి కోలుకున్నారు.

ఓవరాల్ గణాంకాలు చూస్తే, ఇప్పటివరకు ఏపీలో మొత్తం 7,29,307 పాజిటివ్ కేసులు నమోదు కాగా, 6,72,479 మంది కరోనా నుంచి కోలుకున్నారు. ఇంకా 50,776 మంది చికిత్స పొందుతున్నారు. మొత్తం కరోనా మృతుల సంఖ్య 6,052కి పెరిగింది.
Go Back to Shorts
Corona Virus
Andhra Pradesh
Update
Positive Cases
Deaths
Recovery

More Telugu News