విజయ్ దేవరకొండతో అనుష్క సినిమా?
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

విజయ్ దేవరకొండతో అనుష్క సినిమా?

Anushka in Vijay Devarakonda flick
  • ఇటీవలే 'నిశ్శబ్దం' సినిమాలో నటించిన అనుష్క 
  • రెండు సినిమాలు ఒప్పుకున్నానన్న స్వీటీ
  • విజయ్ దేవరకొండతో సినిమాకి గ్రీన్ సిగ్నల్  
ఒకప్పుడు అగ్ర కథానాయకులందరి సరసన నటించిన కథానాయిక అనుష్క ఇటీవల కొత్త నాయికల దూకుడుతో వెనుకపడింది. కథానాయిక ప్రాధాన్యమున్న ఒకటీ ఆరా సినిమాలు మాత్రమే చేస్తోంది. ఆ క్రమంలో ఆమధ్య ఆమె నటించిన 'నిశ్శబ్దం' చిత్రం ఇటీవలే ఓటీటీ ద్వారా విడుదలైంది. అయితే, ఇది ప్రేక్షకులను ఆకట్టుకున్నట్టుగా రివ్యూలు రావడం లేదు.

ఇదిలావుంచితే, ఇటీవల 'నిశ్శబ్దం' ప్రమోషన్స్ లో అనుష్క మాట్లాడుతూ తెలుగులో కొత్తగా రెండు సినిమాలు అంగీకరించానని, వాటి గురించి ఆయా నిర్మాతలే సరైన సమయంలో వెల్లడిస్తారని చెప్పింది. అప్పటి నుంచీ ఆ సినిమాలు ఏమిటా? అని అభిమానులు ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. వీటిలో ఒక చిత్రం విజయ్ దేవరకొండ హీరోగా నటించే సినిమా అని తాజాగా తెలుస్తోంది.

ఒక ఆసక్తికరమైన స్క్రిప్టుతో ఇటీవల ఒక నూతన దర్శకుడు అనుష్క, విజయ్ లను సంప్రదించాడని, కథ నచ్చడంతో ఇద్దరూ ఓకే చెప్పారనీ అంటున్నారు. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలో వెల్లడవుతాయి.
Anushka Shetty
Vijay Devarakonda
Nishabdam

More Telugu News