నన్ను ప్రేమించి మోసం చేశాడు: దర్శన్ పై సినీ నటి సనమ్ ఫిర్యాదు
- 'బిగ్ బాస్ 3' ఫేమ్ దర్శన్ తో సనమ్ ప్రేయాయణం
- ఏడాది తర్వాత దూరం పెట్టిన దర్శన్
- చెన్నైలోని అడయార్ పోలీసులను ఆశ్రయించిన సనమ్
సనమ్ శెట్టి తొలుత మోడల్ గా తన కెరీర్ ను ప్రారంభించింది. ఆ తర్వాత తెలుగు, తమిళం, కన్నడ, మలయాళ చిత్రాల్లో నటించింది. కాలక్రమంలో ఆమెకు దర్శన్ తో పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్తా ప్రేమగా మారడంతో.. ఇద్దరూ ఏడాది పాటు రిలేషన్ షిప్ లో ఉన్నారు. ఆ తర్వాత ఏమైందో కానీ సనమ్ తో దర్శన్ బంధాలను తెంచుకున్నాడు. దీంతో సనమ్ పోలీసులను ఆశ్రయించింది.
తనను పెళ్లి చేసుకుంటానని చెప్పి, మోసం చేశాడని తన ఫిర్యాదులో సనమ్ పేర్కొంది. అతడిని కఠినంగా శిక్షించాలని కోరింది. కేసు నమోదు చేసిన పోలీసులు దర్శన్ కోసం గాలిస్తున్నారు.