Gautam Kichlu: కాజల్ కి కాబోయే భర్త గౌతమ్ గురించిన విశేషాలివి!

Details About Kajal Wouldbe Gautam Kichlu
  • నెట్టింట గౌతమ్ కిచ్లూ కోసం ఫ్యాన్స్ వెతుకులాట
  • 'డిసర్న్ లివింగ్' అనే కంపెనీని నడుపుతున్న గౌతమ్
  • హోమ్ ఇంటీరియర్ డిజైన్ సేవలందిస్తున్న సంస్థ
దక్షిణాది స్టార్ హీరోయిన్ కాజల్ అగర్వాల్ వివాహం ముంబైకి చెందిన వ్యాపారవేత్త గౌతమ్ కిచ్లూతో నిశ్చయమైందన్న వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. గతంలో హీరో రానా వివాహానికి సేవలందించిన 'వెడ్డింగ్ సూత్ర' కంపెనీ పెళ్లి ఏర్పాట్లు చేయడంలో నిమగ్నమైందని కూడా తెలుస్తోంది.

ఇక కాజల్ - గౌతమ్ ల జంట చూడముచ్చటగా ఉందని నెట్టింట కామెంట్లు వస్తున్నాయి. వీరిద్దరిదీ పెద్దలు కుదిర్చిన ప్రేమ వివాహం కాగా, అసలీ గౌతమ్ కిచ్లూ ఎవరంటూ సినీ అభిమానులు నెట్టింట వెతుకులాట ప్రారంభించారు.

ఇంటి అలంకరణ, టెక్ డిజైన్ సేవలందిస్తున్న 'డిసర్న్ లివింగ్' అనే కంపెనీ వ్యవస్థాపకుడు గౌతమ్. ఈ సంస్థకు ప్రస్తుతం చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గానూ విధులు నిర్వహిస్తున్నారు. కంపెనీకి మంచి ఆర్డర్లే ఉన్నాయి. సోషల్ మీడియాలోనూ కిచ్లూ యాక్టివ్ గా ఉంటారు. అతని ఇన్ స్టాగ్రామ్ ఖాతా తెరచి చూస్తే, హోమ్ ఇంటీరియర్ డిజైన్ కు సంబంధించిన ఫోటోలు విరివిగా కనిపిస్తాయి.

సోషల్ మీడియాలో కనిపించే వివరాల ప్రకారం, గౌతమ్ క్యాథడ్రల్ అండ్ జాన్ కోనన్ స్కూల్ తో పాటు టఫ్ట్స్ యూనివర్శిటీలో విద్యను అభ్యసించారు. ఇంటీరియర్ డిజైనింగ్ లో ప్రత్యేక కోర్సులను నేర్చుకున్న తరువాత, సొంత కంపెనీని పెట్టి రాణిస్తున్నారు. ఆయన ఆస్తి విలువ ఎంతన్నది ఇంతవరకూ బహిర్గతం కాలేదు. కాజల్ తో వివాహం విషయం బయటకు పొక్కకముందు అతని పేరు పెద్దగా పరిచితం కూడా కాదు.

మూడు రోజుల పాటు ముంబైలోని ఓ ఫైవ్‌ స్టార్‌ హోటల్ ‌లో వీరి పెళ్లి వేడుకలకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. లాక్ ‌డౌన్‌ తరువాత ముంబైలో జరగనున్న తొలి సెలబ్రిటీ వివాహం ఇదేనని అంటున్నారు. పెళ్లికి కొద్దిమంది మాత్రమే హాజరైనా, వేడుకలు ఆడంబరంగానే జరుగుతాయని తెలుస్తోంది.
Gautam Kichlu
Kajal
Wedding Sutra
Marriage

More Telugu News