ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా కరోనా వచ్చింది... ఆసుపత్రి నుంచి డిశ్చార్జి అవుతున్నా: తమన్నా
- గతవారం తమన్నాకు స్వల్ప జ్వరం
- వైద్యపరీక్షల్లో కరోనా పాజిటివ్
- హైదరాబాదులోని ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స
నిపుణులైన వైద్యుల పర్యవేక్షణలో స్వస్థత పొందానని, ప్రస్తుతం తనను డిశ్చార్జి చేస్తున్నారని వివరించారు. ఏదేమైనా ఈ వారం ఎంతో కఠినంగా గడిచిందని, కరోనా నుంచి కోలుకోవడం ఊరట కలిగిస్తోందని తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా ఎంతోమందిని పీడిస్తున్న ఈ మహమ్మారి వైరస్ నుంచి పూర్తిగా కోలుకుంటానని తాను ఆశావహ దృక్పథంతో ఉన్నానని తన ప్రకటనలో వివరించారు.
ప్రస్తుతం డాక్టర్ల సలహా మేరకు సెల్ఫ్ ఐసోలేషన్ లో ఉండదలుచుకున్నానని, ఈ సమయంలో తన ఆరోగ్యం పట్ల ఆందోళన కనబర్చినవారికి, తనపై ప్రేమ చూపినవారికి ఆత్మీయ ఆలింగనాలు అంటూ పేర్కొన్నారు.